NLR: ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పంచాయతీ బస్టాండ్ వద్ద కూటమి నాయకులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పలువురు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా కాకర్ల సురేశ్ తొలిసారి ఎన్నికైనప్పటికీ ఎంతో అనుభవంతో ఉదయగిరి నియోజకవర్గ రూపు రేఖలు మార్చేందుకు అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు.