సత్యసాయి: పెనుకొండ మండలంలోని బీటెక్ విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో ఆమె సొంత బాబాయి వెంకటరెడ్డిపై కేసు నమోదైంది. నిందితుడు ఆ యువతికి అర్ధరాత్రి వీడియోకాల్ చేసి ‘పిన్ని ఊరికెళ్లింది. మంచి మూడ్లో ఉన్నా’ అంటూ మెసేజ్లు చేసి, తన ప్రైవేట్ పార్ట్ ఫొటోను పెట్టాడు. ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి కియా పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసలు కేసు నమోదు చేశారు.