VSP: GVMC జోన్- 3 పరిధిలో దుకాణాలు, కళ్యాణ మండపాలు, రోడ్ సైడ్ మార్కెట్లకు సెప్టెంబర్ 26న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్ బుధవారం తెలిపారు. జోన్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపాలు, పలు వార్డుల్లో వ్యాపార సముదాయాలను వేలం వేస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు GVMC జోన్- 3 జోనల్ ఆఫీసు వద్ద ఈ నెల 26న ఉదయం11 గంటలకు హాజరుకావాలన్నారు.