NGKL: ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.