షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్కు గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుండగా ఆయన గాయపడ్డారు. అయితే స్వల్ప గాయాలే అని, ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని ఆయన టీమ్ స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.