ICC తాజాగా విడుదల చేసిన T20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, జట్టు, ఆల్‌రౌండర్ల విభాగాల్లో టాప్ ర్యాంకింగ్‌లను దక్కించుకుంది. 271 రేటింగ్ పాయింట్లతో నెంబర్ 1 జట్టుగా భారత్ నిలవగా, బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, ఆల్‌రౌండర్ల జాబితాలో హర్దిక్ పాండ్యా అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు.