ప్రకాశం: పొన్నలూరు మండల కేంద్రంలో డీపీవో వెంకటేశ్వర్లు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న డోర్ టూ డోర్ చెత్త సేకరణను MPDO సుజాతతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తడి చెత్తను, పొడి చెత్తను వేరుగా చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని అన్నారు. అనంతరం చెత్త సంపద కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి, అధికారులకు పలు సూచనలు చేశారు.