HYD: శిల్పారామంలో సరస్ మేళాతో పల్లె కాంతుల సందడిని సంతరించుకుంటోందని మంత్రి సీతక్క తెలిపారు. గ్రామీణ జీవితపు పరిమళాన్ని, చేనేత కళాకృతుల అందాన్ని ఒకే వేదికపై చూసే అరుదైన అవకాశం ఇది అన్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్లో ఏర్పాటు చేసిన ఈ మేళాలో దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రత్యేక వస్తువులు, సంప్రదాయ వంటకాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు.