NDL: పాణ్యం నుండి గోరుకల్ రిజర్వాయర్ వరకు రూ. 6.29 కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారి పనులను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం సాయంత్రం పరిశీలించారు. కొండజుటూరు, గోరుకల్, ఎస్ కొట్టాల, దుర్వేసి గ్రామాలను కలుపుతూ 13.125 కి.మీ. పొడవున రూ.6.29 కోట్ల వ్యయంతో పూర్తయిన రహదారి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు.