CTR: రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సెక్రటరీగా ద్రావిడ విశ్వవిద్యా లయం ఆంగ్ల శాఖలో ప్రొఫెసర్ ఆచార్య బి తిరుపతిరావును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గతంలో టీడీపీ హయాంలో ద్రావిడ వర్సిటీ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించారు. కాగా, ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ సెక్రటరీగా రెండేళ్ల పాటు ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.