NDL: పాణ్యం మండలంలోని కందికాయపల్లె గ్రామంలో రెండు రోజులుగా చిరుతపులి సంచారం గ్రామస్తుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. అయితే ఈ మధ్య పెద్దమ్మ గుడి వద్ద సీసీ కెమెరాల్లో చిరుత కనిపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, అటవీశాఖ అధికారులు మంగళవారం గ్రామ సమీపంలోని పొలాలు, కాల్వల వెంట పర్యటించి, ప్రజలను అప్రమత్తం చేశారు.