AP: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించారు. వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ ఈనెల 18న నోటీసులు పంపగా తాజాగా వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీలో చంద్రబాబు తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని శంకరయ్య ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.