సత్యసాయి: బత్తలపల్లిలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం శ్రీ లలితత్రిపుర సుందరీ దేవి అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు చేసి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.