ELR: ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో నిర్వహించిన వైద్య శిభిరాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం సందర్శించారు. గ్రామస్థులు గ్రౌండ్ వాటర్ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆమెకు వివరించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ RWS అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలన్నారు. నీటిని పరిక్షించి ప్రజలకు రక్షిత మంచినీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.