MBNR: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ వార్డులో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. మంగళవారం రాత్రి కాలనీ మహిళలు పెద్ద ఎత్తున ఒక చోటకు చేరుకుని చూడచక్కగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా కోలాటం ఆడుతూ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.