KNR: బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ కేంద్రాలలో బీజేపీ శ్రేణులు జాతీయ జెండాను ఎగరవేశారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడారు.