MBNR: దేవరకద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం వైద్య నిర్లక్ష్యం వెలుగు చూసింది. జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళ్లిన బలుసుపల్లి గ్రామానికి చెందిన నాగరాజుకు, వైద్యులు జ్వరానికి ఇవ్వాల్సిన ఇంజక్షన్‌కు బదులుగా కుక్క కరిస్తే వేసే రేబిస్ టీకా ఇంజక్షన్‌ను ఇచ్చారు. డాక్టర్ శరత్ చంద్ర సూచన మేరకు ఏఎన్ఎం ఈ పొరపాటు చేసిందని అన్నారు.