ASF: కేరిమెరి మండలంలోని చారిత్రాత్మకమైన జోడేఘాట్‌ను శాసనమండలి డిప్యుటీ ఛైర్మన్ బండ ప్రకాష్, MLA కోవ లక్ష్మి బుధవారం సందర్శించారు. కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జోడేఘాట్‌లో ఉన్న మ్యూజియాన్ని సందర్శించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఎంత గొప్పవో ఈ మ్యూజియం ద్వారా మరోసారి తెలుసుకోగలిగామన్నారు.