ప్రకాశం: కొండేపి పొగాకు వేలం కేంద్రంలో గురువారం ఎఫ్వన్ పొగాకు కేజీకు రూ.343 పలికింది. లో గ్రేడ్ ధరలు రైతులను నిరాశపరుస్తున్నాయి. ఈ ఏడాది అధికంగా లో గ్రేడ్ పొగాకు దిగుబడి వచ్చింది. దీంతో నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. ఈ మేరకు క్వింటాకు రూ.34,300 ధర పలకడం సంతోష దగ్గ విషయమైనప్పటికీ ఎవరి దగ్గర నాణ్యమైన పొగాకు లేకపోవడం దురదృష్టకరమని రైతులు వాపోతున్నారు.