SRD: జహీరాబాద్ మండలం రంజోల్లోని సంగమేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఆఫ్ ఇండియా జిల్లాస్థాయి కబడ్డీపోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అండర్-14, 17 విభాగాల్లో రెండు రోజులపాటు జరిగే ఈ పోటీలలో మొత్తం 27 జట్లు పాల్గొంటున్నాయి. జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ ఈ పోటీలను ప్రారంభించి, భవిష్యత్తులోనూ క్రీడాకారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.