NRPT: నారాయణపేట జిల్లా BJP ప్రధాన కార్యదర్శిగా అప్పంపల్లి గ్రామానికి చెందిన డోకూరు తిరుపతిరెడ్డిని ఎన్నుకోవడం జరిగిందని నారాయణపేట జిల్లా అధ్యక్షుడు సత్తి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తిరుపతిరెడ్డి ఎంపిక పట్ల మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.