W.G: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘం అధ్యక్షుడిగా చాగంటి పార్థసారధి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని, నూతన అధ్యక్షుడికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి సంఘం మరింత కృషి చేయాలని సూచించారు.