VZM: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్న డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి వ్యాఖ్యలను టీడీపీ నాయకులు ఖండించారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మెడికల్ కాలేజీపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు.