KDP: రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సాయి దత్త ఆధ్వర్యంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందించాలన్నారు.