ప్రకాశం: వర్షాల నేపథ్యంలో కనిగిరి మండలంలోని అన్ని పంచాయతీలలో పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర సింహారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా బుధవారం కనిగిరి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ దంతులూరు ప్రకాశం అధ్యక్షతన జరిగింది. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంచాయతీలలో ప్రధానంగా వీధిలైట్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.