సత్యసాయి: మడకశిర మండలంలోని కేజీఎస్ తండాలో మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలను ఎంఈవో నరసింహమూర్తి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది? అధ్యాపకులు సమయానికి వస్తున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో పాఠాలు చదివించారు.