AP: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి అయ్యాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ తెలిపారు. గతేడాది తిరుమల బ్రహ్మోత్సవాల్లో జరిగిన లోపాలను గుర్తించి సవరించామని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఐదు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కాగా తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి.