తూ.గో: జిల్లాలో ఇటీవల కనిపిస్తున్న జ్వరాలు సాధారణ జ్వరాలేనని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో జ్వరాల పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.