NTR: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ వీధిలో వీధిలైట్లు వెలగకపోవడంతో ప్రజలు చీకట్లో భయపడుతున్నారు. స్టేషన్ సెంటర్ నుంచి కొల్లి ఆదినారాయణ వీధి వరకు లైట్లు లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను స్థానికులు కోరుతున్నారు.