GDWL: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని శ్రీ జమ్ములమ్మ అమ్మవారి దేవాలయంలో జరగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆలయ కమిటీ శనివారం ఆహ్వానించింది. ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆలయ కమిటీ ఛైర్మన్ బోయ వెంకట్రాములు, ఈవో పురంధర్ ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు.