KMR: డోంగ్లి మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 3,170 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని మండల వ్యవసాయ అధికారి శివకుమార్ తెలిపారు. 2,400 ఎకరాల్లో సోయా, 40 ఎకరాల్లో పత్తి, 500 ఎకరాల్లో వరి, మిగిలినది పెసర, మినుము పంటకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. నష్టపోయిన పంటలను ఏఈవోలతో సర్వే చేయించి వివరాలు సేకరించినట్లు ఏవో శివకుమార్ తెలిపారు.