RR: బీఆర్ఎస్ కార్యకర్తలపై పెట్టే అక్రమ కేసులకు ఎవరు భయపడద్దని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. కేశంపేట మండలంలోని కొత్తపేట, ఇప్పలపల్లి గ్రామాల్లో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలపై కేసులు పెడితే ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొత్తపేట మాజీ సర్పంచ్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.