BHNG: వలిగొండ మండలంలో అనుమతులు లేకుండా వెలుస్తున్న వెంచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని MPDO జలంధర్ రెడ్డి హెచ్చరించారు. వలిగొండ పట్టణంలోని ప్రగతి కాలేజీ వెనుక భాగంలో నూతనంగా నిర్మిస్తున్న ఒక వెంచర్‌ను ఆయన పరిశీలించారు. అన్ని రకాల అనుమతులు పొందాలని నిర్వాహకులకు సూచించారు. అనుమతులు లేకుండా ప్లాట్ల క్రయవిక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.