SRD: ఇప్పటివరకు 3111 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ గురువారం తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 514 మెట్రిక్ టన్నుల యూరియా డీలర్ల వద్ద అందుబాటులో ఉందని చెప్పారు.6912 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు ఇంకా రావాల్సి ఉందని పేర్కొన్నారు. చివరి వారం వరకు యూరియా సరఫరా అవుతుందని పేర్కొన్నారు.