ATP: జిల్లాలో 20,000 మందికిపైగా ఆటోడ్రైవర్లు ఉన్నారు. వీరిలో అర్హులైన వారు నేటి నుంచి ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అక్టోబరు 1న నగదు జమ చేయనున్నారు. ఆటో డ్రైవర్లకు ఆర్థికసహాయం అందించేందుకు ప్రభుత్వం ఆటోమిత్ర పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఏడాదికి రూ.15,000 చొప్పున అందజేయనున్నారు.