MBNR: జడ్చర్ల పట్టణంలోని నాగర్ కర్నూల్ రోడ్లో యూరియా లభించక మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న వ్యవసాయ అధికారి గోపీనాథ్, ఎస్సై మల్లేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని యూరియాను ఇప్పిస్తామని రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింప చేశారు.