NZB :పెండింగ్ కేసులు త్వరగా క్లియర్ చేయాలని నిజామాబాద్ CP సాయి చైతన్య ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. అసాంఘిక కార్య కలాపాలు గంజాయి, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.