ATP: గుత్తి తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా గురువారం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. అర్హులైన వీఆర్ఏలకు వీఆర్వో, అటెండర్, వాచ్మెన్, డ్రైవర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.