NTR: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ మంగళవారం గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనుందని ఆలయ పండితులు తెలిపారు. స్వర్ణ పంచముఖాలు, బంగారు అభయహస్తాలు, పచ్చల హారం, కంఠాభరణం, శంఖు చక్రాలు, బంగారు కిరీటంతో వేదమాత దర్శనమిస్తుందని చెప్పారు. దసరా నవరాత్రుల రెండో రోజు ఈ అలంకారం చేస్తారు. అమ్మవారిని శంఖం, చక్రం, గద, అంకుశం వంటి ఆయుధాలతో, మంత్రాలతో అలంకరిస్తారు.