GDWL: కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,12,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అధికారులు మంగళవారం 42 గేట్లు ఎత్తి 3,19,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.790 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.