SKLM: హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద గుర్రపు డెక్క వంశధార నదిని కమ్మేస్తున్నట్లు దర్శనమిస్తోంది. గొట్టా బ్యారేజ్ గేట్లు వద్ద ఎక్కువ ప్రాంతం నుంచి నీటిలో కొట్టుకు వచ్చిన గుర్రపు డెక్క నీటిపైన మైదానంలా కనిపిస్తోంది. ఇది నీటి ప్రవాహానికి అడ్డంకిగా నిలుస్తోంది. నీటిపై పచ్చని తివాచీ పరిచినట్లు ఉందని బ్యారేజీని స్థానికులు వెల్లడించారు.