VZM: సంతకవిటి పోలీస్ స్టేషన్లో గురువారం ఓ ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదైంది. SI గోపాలరావు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి కొన్నేళ్లుగా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత ముఖం చాటేశాడని, దీంతో ఆర్మీ ఉద్యోగిపై సదరు యువతి గురువారం సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.