RR: శామీర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మేడ్చల్‌కు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్.. ముందు ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమై, డ్రైవర్ మల్లేష్ తీవ్ర గాయాలతో అందులో ఇరుక్కుపోయాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.