వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా ఫైనల్ చేరాడు. అయితే ఈ టోర్నీలో నీరజ్ బంగారు పతకం సాధిస్తే.. అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో వరుసగా రెండు స్వర్ణాలు గెలిచిన మూడో జావెలిన్ త్రోయర్‌గా నిలుస్తాడు. గతంలో చెక్ లెజెండ్ జాన్ జీలెంజీ, జోహన్నెస్ ఈ ఫీట్ సాధించారు. ప్రస్తుతం నీరజ్ చోప్రాకు జాన్ జీలెంజీ కోచ్‌గా ఉండటం విశేషం.