అదానీ గ్రూపునకు సెబీ క్లీన్ చీట్ ఇచ్చింది. అదానీపై ఆరోపణలను హిండెన్‌బర్గ్ రుజువు చేయలేకపోయిందని సెబీ పేర్కొంది. ఈ విషయంపై గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. తప్పుడు నివేదిక వల్ల మదుపరులు నష్టపోయారని అదానీ ఆవేదన వ్యక్తం చేశారు. అవాస్తవాలు వ్యాప్తి చేసినవారు దేశానికి క్షమాపణలు చెప్పాలని అదానీ డిమాండ్ చేశారు.