HYDలో నిరుద్యోగ సమితి నాయకులు అశోక్ ఆమరణ నిరాహార దీక్ష 4 రోజులుగా చేస్తుండగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లుగా బృందాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు.