GNTR: తెనాలి మండలం రత్నా టాకీస్ నుంచి బుర్రిపాలెం వరకు గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ అధికారి ఏఈ సుధీర్ కుమార్ తెలిపారు. బుర్రిపాలెం రోడ్డులోని సబ్ స్టేషన్లో మరమ్మతుల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నామని ఆయన చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.