TG: హైదరాబాద్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేశ్ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన తనయుడు విక్రాంత్ ఇంట్లోనూ సోదాలు జరుపుతున్నారు. రెండు బృందాలుగా విడిపోయిన అధికారులు.. అల్వాల్, మారేడుపల్లిలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.