MDK: రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ బోరు మోటర్ రిపేరు చేయడానికి వెళ్లి మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. జీపీ వర్కర్ నర్సింలు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు, ప్రభుత్వం పంచాయతీ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.