E.G: కలెక్టర్ కీర్తి చేకూరిని గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయ ఛాంబర్లో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి. నరసింహ కిషోర్ మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యవస్థల సమర్థవంతమైన అమలు వంటి పలు అంశాలపై ఇరువురు చర్చించారు.